ముథోల్ మండల కేంద్రంలోని పశుపతి నాథ్ ఆలయంలో అఖండ హరినామ సప్తాహం గురువారం ప్రారంభమైంది. శివాలయం ఆవరణలో ప్రతి సంవత్సరం అఖండ హరినామ సప్తాహం నిర్వహిస్తారు. ఈ సప్తాహకు ప్రతి సంవత్సరం భక్తులు ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణం కోసం వస్తారు. శివరాత్రి పండుగకు ముందుగా సప్తాహ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గత 13 సంవత్సరాల నుంచి అఖండ హరినామ ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణం చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.