ఉట్నూర్ మండల కేంద్రానికి శనివారం మంత్రి సితక్క రానున్నట్లు శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మా బోజ్జు పటేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గ పార్టీ శ్రేణులు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.