పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం వరమని, పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఎంపీడిఓ కార్యాలయంలో 73 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.