కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం.. 699. 375 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎక్కువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 979 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. ప్రాజెక్టు లెఫ్ట్, రైటు కెనాళ్ల ద్వారా 883 మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.