కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని పట్టబద్ధులు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంగళవారం కాంగ్రెస్ పార్టీ కడెం పట్టణ అధ్యక్షుడు వాజిద్ ఖాన్ కోరారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు మండలంలోని పెద్దూరు తండాలో ఎన్నికల ప్రచారం చేశామన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయనతో పాటు లక్ష్మణ్, షర్ఫుద్దీన్, మహమూద్, తదితరులు ఉన్నారు.