జన్నారం మండలంలోని మర్రిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ గోండుగూడాలను కలుపుతూ నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేలు వినతి పత్రం అందించారు. ప్రేమ్ సాగర్, రాజన్న, మల్లే శ్రీనివాసులు మాట్లాడుతూ ఆ రెండు గూడాలలో దాదాపు 600 జనాభా ఉన్నారని, గ్రామపంచాయతీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడం చేత అభివృద్ధి జరగడం లేదన్నారు.