నాగార్జునసాగర్ నియోజకవర్గ యువతకు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జానా రెడ్డి గారి అభిమానులకు హృదయపూర్వక నమస్కారం మతం పేరుతో కేంద్ర ప్రభుత్వం, మద్యం మత్తులతో రాష్ట్ర ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చలగాటం ఆడుతున్న విషయం యావత్ తెలంగాణ గమనిస్తోంది. ఇంటికి ఒక ఉద్యోగం అని కేసిఆర్ మోసం చేస్తే ఏడాదికి రెండు కోట్ల
ఉద్యోగాలు అని మోడీ యువతను మోసం చేశారు. ఇందుకు నిరసనగా రేపు అనగా ఏప్రిల్ 28 తారీకున శుక్రవారం నాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ జరగనుంది. టీఎస్పీఎస్సీ, పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ, నిరుద్యోగుల గోస ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ వైఫల్యం పై యువతకు నిరుద్యోగులకు అండగా
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో మన నాగార్జునసాగర్ నియోజకవర్గ నుండి అధిక సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర యువ నాయకులు కుందూరు జైవీర్ రెడ్డి పిలుపునిచ్చారు.