కష్టం మిల్లింగ్ రైస్ (సిఎంఆర్), ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీకి మిల్లర్ల సహకారం అవసరమని రాష్ట్ర పౌరసరఫరాల ప్రిన్సిపల్ కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్ కోరారు. మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో మిల్లింగ్ ఇండస్ట్రీ బలపడాల్సిన అవసరం ఉందని అన్నారు.