నల్గొండ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం గొప్ప విషయం అని. NSUI జిల్లా కార్యదర్శి వైరు ప్రసాద్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల నిర్మాణం ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందుతుందని ఆదివారం తెలిపారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వెంకట్ రెడ్డి లకు విద్యార్థుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.