నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నల్గొండ జిల్లాకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లను మంజూరు చేసింది. ఈ విద్యా సంవత్సరం ఐటీఐ (బి), డిండి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కేంద్రాల్లో శిక్షణ పూర్తి చేసిన వారికి నూరు శాతం ఉద్యోగం అవకాశం కల్పించనున్నట్లు శనివారం కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.