నల్గొండ జిల్లాలో 177 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి ధ్రువీకరణ పత్రానికి మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుని, తిరిగి అక్కడి నుంచే సంబంధిత పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. మూడు వారాలుగా సర్వర్ పని చేయకపోవడంతో ఆయా సేవలన్నీ నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ తదితర పత్రాల కోసం మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. మరణ, జనన ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.