నల్గొండ జిల్లా పరిధిలోని అన్నెపర్తి గ్రామంలో గల మహాత్మాగాంధీ యూనివర్సిటీలో న్యాయవిద్య ఏర్పాటు చేయాలని విద్యార్థి నాయకులు వాడపల్లి నవీన్ అన్నారు. గురువారం ఉదయం యునివర్సిటీలోని సుమారు 100 మంది విద్యార్థులతో సంతకాల స్వీకరించిన వినతి పత్రాన్ని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ గోపాల్ రెడ్డికి యూనివర్సిటీ విద్యార్థి నాయకులు వాడపల్లి నవీన్ ,శ్రీమన్, సందీప్ ,సంజయ్ అందజేశారు.