చేనేత కార్మికులు తయారు చేస్తున్న వస్త్రాలను ప్రజలు ఆదరించాలని అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర అన్నారు. చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ చేనేత కార్మికులు నాణ్యతతో కూడిన అన్ని రకాల డిజైన్లతో వస్త్రాలను తయారు చేస్తారని తెలిపారు. అనంతరం వివిధ స్టాల్స్‌ను పరిశీలించారు.