నవంబర్ 17 , 18 తారీకులలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న గ్రూప్ -3 నిర్వహణకు గాను నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నాలుగు కాన్స్టిట్యూఎన్ట్ కళాశాలలకు కేంద్రాలు కేటాయించారు. రెండు రోజులు మూడు దఫాలుగా జరగనున్న పరీక్షలను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించుటకు శనివారం ఎంజీయూ పరిధిలోని కళాశాలల ప్రిన్సిపాల్ లు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.