ఈ వానాకాలం ధాన్యం కొనుగోలులో భాగంగా ఎట్టి పరిస్థితులలో బయటి ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుండి నల్గొండ జిల్లాకు ధాన్యం రావడానికి వీల్లేదని అన్నారు. 2024- 25 వానకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, తీసుకోవాల్సిన చర్యలపై గురువారం అయిన ఉదయాదిత్య భవన్ లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.