ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ పాలు ఫిర్యాదులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 25 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.