ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వాలి

1427பார்த்தது
ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వాలి
కట్టంగూరు మండల కేంద్రం లో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 6 వ మండల మహాసభల సందర్బంగా ఆదివారం సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకులు హాజరై మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని మరియు ప్రభుత్వ రంగ సంస్థలను సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా పంచుతున్న వృద్ధాప్య వికలాంగుల వితంతు ఒంటరి మహిళల పెన్షన్లు అర్హులైన వారందరికీ ఇవ్వాలని, ప్రభుత్వం వెంటనే ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి పంట రుణాలను విడుదల చేయాలని కోరారు.

అర్హులైన పేదలకు డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు మంజూరు చేయాలని , సొంత స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు కేటాయించాలని, స్థలమే లేని పేదలకు 120 గజాల స్థలం కేటాయించి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని కోరారు.

అనంతరం వ్యకాస నూతన మండల కమిటీ ని 19 మంది తో ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు కార్యదర్శులు గా ఇటుకుల సురేందర్, గుడుగుంట్ల రామక్రిష్ణ, ఉపాధ్యక్షులు గా బొడ్డుపల్లి నాగమ్మ , ఊట్కూరు శ్రీను, సహాయ కార్యదర్శులు గా గద్దపాటి యాదగిరి, ధరణి బోయిన సైదమ్మ, చింత సైదులు లను ఎన్నుకోవడం జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి, మహిళ కూలీల జిల్లా కన్వీనర్ దండేంపల్లి సరోజ, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పెంజర్ల సైదులు, మత్స శాఖ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మురారి మోహన్, కేజీకేస్ దండేంపల్లి శ్రీను, జాల రమేష్, గోలి స్వామి, ప్రజా సంఘాల సభ్యులు గద్దపాటి యాదయ్య, పెంజర్ల కృష్ణ, జాల ఆంజనేయులు, దండేంపల్లి నర్సింహా, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி