మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం: శేపూరి రవిందర్

678பார்த்தது
మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం: శేపూరి రవిందర్
చిట్యాల మండలం చిన్న కాపర్తి వాస్తవ్యులు పల్లపు ఇద్దయ్య గుండెపోటుతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ శనివారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి భౌతికాయనికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు 5000 వేల ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఏసీ మోర్చా కార్యవర్గ సభ్యులు మాస శ్రీనివాస్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు, చిట్యాల పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி