బెల్ట్ షాపుల నిర్మూలన వల్ల గీత కార్మికులకు ఉపాధి పెరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గౌడ సోదరులకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడిచెట్టు నుండి కింద పడిపోకుండా గౌడ్ అన్నల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్లను పంపిణీ చేస్తుందని అన్నారు.