నల్గొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీలో వాటర్ మెన్ గా విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందిన బిక్షమయ్య కుటుంబాన్ని ఆదుకోవాలంటూ బుధవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు, కుటుంబ సభ్యులు మున్సిపల్ ఆఫీసు ఎదుట మృతదేహంతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.