మిర్యాలగూడ డివిజన్ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి మరొకరిని రిమాండ్ పంపినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్ లో పట్టుబడ్డ అక్రమ రేషన్ బియ్యం వాహనాలు అక్రమ వ్యాపారుల నుండి 74 క్వింటాల రేషన్ బియ్యం, లారీ, 2 బొలెరో వాహనాలు స్వాధీనం చేశామన్నారు.