మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. బీసీ గర్జనసభలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. పార్టీ అధిష్టానం స్పందించి తక్షణమే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.