దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర ఇరిగేషన్ సమస్యలపై బుధవారం హైదారాబాద్ లోని జలసౌధలో ఇరిగేషన్ శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ, పెండింగ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయవలసిన ఆవశ్యకతను, పూర్తి చేయడానికి తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు.