టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి

2702பார்த்தது
టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి
మహిళలపై బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న వేధింపులకు చరమ గీతం పాడాలని బీసీ పొలిటికల్ యువజన జేఏసీ నల్గొండ జిల్లా అధ్యక్షులు చింతపల్లి సతీష్ గౌడ్ డిమాండ్ చేశారు. సాధారణ పౌరులు వేధింపులు చేస్తే శిక్షించవలసిన స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధులే ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి. ప్రశ్నించారు. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పై ఎమ్మెల్యే వేధింపులు సరికాదన్నారు. రోజు రోజు కు బీసీలపై అగ్రవర్ణాల అవమానాలు అధికం అయ్యాయని అన్నారు. హొహొ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, దొరల తెలంగాణ అయిందని అన్నారు. ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చిన మహిళలపై సొంత పార్టీ నాయకులు వేధింపులకు గురి చేయడం సరి కాదన్నారు. గత మూడు సంవత్సరాల నుండి జగిత్యాల మున్సిపాలిటీ లో చైర్మన్ శ్రావణిహొ పట్టణ. అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ పార్టీకి ప్రజలకు సేవ చేస్తూన్నారని అన్నారు. పూర్తి చేసిన పనులకు బిల్లులు కానివ్వకుండా, ఇబ్బందులకు గురిచేయడమేమిటని అన్నారు. ఎక్కడ మీటింగ్ జరిగిన ఒక మహిళ అని చూడకుండా ప్రజల ముందే కించపరుస్తూ మాట్లాడడం ఆయన ఆహంకార వైఖరికి నిదర్శనం అన్నారు. తన కుటుంబం అంతు చూస్తానని బెదిరించడం ఒక శాసనసభ్యునికి తగదని వారన్నారు. ఇలాంటి వారిపై వెంటనే కేసీఆర్ స్పందించి, పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వారిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో మహిళలు మరియు బీసీ సమాజమంతా రాబోయే ఎన్నికల్లో ఇలాంటి నాయకులను పెంచి పోషించే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరిస్తున్నాం అని అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி