శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ ఉరకలేస్తోంది. దీంతో సాగర్‌కు భారీగా వరద నీరు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో సాగర్ 18 గేట్లను ఎత్తి.. దిగువకు 1.14 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 311.44 టీఎంసీలు కాగా, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ఇక ఇవాళ సెలవు దినం కావడంతో సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.