TG: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వక్ఫ్ (సవరణ) బిల్లు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ముస్లిం నేతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టనున్నారు. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం నాయకులు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు.