TG: 11 నెలల్లో 53 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గురుకులాలు, స్కూళ్లలో 18,310 టీచింగ్ పోస్టులు, పోలీస్ శాఖలో 16,067 ఉద్యోగాలు, 7094 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొంది. ఇందులో విద్యాశాఖకు చెందినవే అధికంగా ఉన్నాయని తెలిపింది. ఇటీవల పలు విభాగాల్లో 5,378 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది.