నారాయణఖేడ్: ప్రభుత్వ భూములను కాపాడాలి
నారాయణఖేడ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆదివారం సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి, గణపతి మాట్లాడారు. నాగల్ గిద్ద మండలంలో ప్రభుత్వ భూములలో ప్రైవేట్ వెంచర్స్ వ్యక్తులు రోడ్డు వేసుకుని దర్జాగా వ్యవసాయ భూములను గుంటలు చొప్పున అక్రమదారిలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రైతులు, పలువురు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడం లేదని అన్నారు.