అంబేద్కర్, పూలే ఆశయ సాధనకు కృషి చేద్దామని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ అన్నారు. కెవిపిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి లోని సంఘ భవనం వద్ద జెండాను బుధవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కుల విక్ష నిర్మూలనే లక్ష్యంగా సంఘం ఆవిర్భవించిందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అశోక్, నాయకులు పాల్గొన్నారు.