సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండల పరిధిలోని రొయ్యపల్లి, షేర్ఖాన్పల్లి, నాగారం, పలుగు మీది నల్ల పోచమ్మ అటవీ ప్రాంతాలలో మంగళవారం ఉదయం 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 77%గా ఉంది. చలి పెరగడంతో జనాలు కాలు బయట పెట్టడానికి జంకుతున్నారు. ఉదయం వెళలో విజిబిలిటీ తగడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసి మరి వాహనాలు నడిపారు.