మెదక్ జిల్లా కేవల్ కిషన్ భవన్ లో సోమవారం సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుక్క రాములు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలన్నారు. మహిళలకు ఇస్తానన్న 2500 ఆర్థిక సాయం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా పేరుతో దౌర్జన్యాలను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.