మెదక్ జిల్లా అర్ముడ్ రిజర్వ్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ జైపాల్ మరణించారు. జైపాల్ కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత స్కీమ్ ద్వారా 8 లక్షల రూపాయల చెక్కును మంగళవారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోలీసు శాఖ కృషి చేస్తుందన్నారు. భద్రత పథకం సిబ్బంది కుటుంబాలకు బాసటగా ఉన్నదని అన్నారు.