మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్థిక, సామాజిక సర్వే కార్యక్రమం రెండవ వార్డ్ కోమటిపల్లి వడ్డెర కాలనీలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ దేవేందర్ సమగ్ర సర్వే పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.