తెలంగాణ సాయుధ పోరాటాన్ని బిజెపి వక్రీకరించేందుకు ప్రయత్నిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు విమర్శించారు. గజ్వేల్ పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ ముగింపు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని చెప్పారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మంద పవన్ పాల్గొన్నారు.