జన్నారం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్స్ లో నెదర్లాండ్స్, జర్మనీకి చెందిన 16 మంది బుధవారం బస చేశారు. నార్నూర్, జైనూర్ ప్రాంతంలోని రైతులకు వీరంతా పత్తి విత్తనాలను గతంలో సరఫరా చేశారు. ఇప్పుడు అదే రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు వచ్చి ఒకరోజు రాత్రి బస చేసి ఉదయం వెళ్ళిపోయారు. రెండేళ్లుగా ప్రతి ఏడాది ఆ రెండు దేశాలకు చెందిన వారు వచ్చి ఇక్కడ బసచేస్తారని హరిత రిసార్ట్స్ మేనేజర్ వీరేందర్ తెలిపారు.