సింగరేణిలో కొత్త గనులు ఏర్పాటు చేస్తామని, ఇందుకు తమదే బాధ్యత అని రాష్ట్ర కనీస వేతన మండలి చైర్మన్, ఐఎన్ టియుసి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన శ్రీరాంపూర్ లో మాట్లాడుతూ, సింగరేణిలో కొత్తగనులు తీసుకొస్తేనే సంస్థకు భవిష్యత్తు ఉంటుందని, వచ్చే నాలుగేళ్లలో ఆరు బొగ్గు గనులు ప్రారంభించేలా ప్రభుత్వంతో చర్చిస్తున్నామని వెల్లడించారు.