ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, ఆర్డీఓ శ్రీనివాస్ రావుతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే దిశగా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.