మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ చిత్రపటానికి బుధవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు ఏనాడు విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే కాంగ్రెస్ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై కోట్ల భారం మోపాలని ప్రయత్నించిందని ఆరోపించారు.