సైబర్ నేరాల పట్ల సీనియర్ సిటిజన్లు అవగాహన కలిగి ఉండాలని బుధవారం రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. తెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఎలాంటి సమాచారం ఇవ్వవద్దని, వాట్సాప్, వీడియో కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యధిక లాభాలు వస్తాయని చెబితే ఆశ పడవద్దని, డిజిటల్ అరెస్టులకు భయపడొద్దని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేయాలని కోరారు.