రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే శుక్రవారం జైపూర్ గ్రామ పంచాయతీలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాకుల వారీగా ఇంటింటికి వెళ్లి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ డీఈ విద్యాసాగర్, ఎంపీఓ శ్రీపతి బాపురావు, తదితరులు పాల్గొన్నారు.