లక్షేట్టిపేట: వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని ఐసీటీసీ సీపీఎం నీలిమ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సబ్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీలకు ఐసీటీసీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. వారికి మందులు పంపిణీ చేసి, వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జైలర్ స్వామి, వైద్యాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.