న్యూఢిల్లీలో డిసెంబర్ 21 నుండి 22వ తేదీ వరకు జరగనున్న జాతీయ గణిత సదస్సుకు కాసిపేటలోని జడ్పీ హైస్కూల్ లో పని చేస్తున్న గణిత ఉపాధ్యాయుడు కాసం సంతోష్ ఎంపికయ్యారు. ఖర్చు లేకుండా గణిత ప్రయోగశాల కార్యక్రమాల ద్వారా సెకండరీ స్థాయి విద్యార్థుల అభ్యసన ప్రగతిపై ప్రభావం అనే తన పరిశోధన వ్యాసం ప్రతిష్ఠాత్మకమైన జాతీయ గణిత విద్య సదస్సు కోసం ఎంపికైంది. ఈ సందర్భంగా ఆయనను డీఈఓ యాదయ్య, తదితరులు అభినందించారు.