భారీ వర్షాలతో వరదలకు గురై అన్ని కోల్పోయిన వారికీ స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారాన్ని అందజేస్తున్నాయి. శుక్రవారం శ్రీ షణ్ముఖ సాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవోలోపర్స్ ఆధ్వర్యంలో మంచిర్యాల గణేష్ నగర్ వరద బాధితులకు దుప్పట్లు (బ్లాంకెట్స్) పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ బేతి తిరుమల్ రావు, కండె ఓం నమః శివాయ, బేతి సత్యనారాయణ, బేతి అనంతసాయి కాలనీ వాసులు పాల్గొన్నారు.