నెన్నెల మండలంలోని శ్రావణపల్లి గ్రామంలో శనివారం బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జలుద్దీన్ ఆధ్వర్యంలో.. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ డాగ్ ద్వారా గంజాయి రవాణా, సేవించేవారు. అనుమానితులను తనిఖీ చేశారు. పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించి, 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని, 150 లీటర్ల గుడుంబా ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ప్రసాద్, రమేష్, మహేందర్ పాల్గొన్నారు.