కోల్ ఇండియా స్థాయిలో ప్రతిభ కనబరిచి సింగరేణి ఖ్యాతిని చాటాలని మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. మంగళవారం మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో సింగరేణి ఏరియా స్థాయి ఫుట్బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు ఏరియా అధికారులు, యూనియన్ నాయకులతో కలిసి బెలూన్లను వదిలి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని జీఎం తెలిపారు.