మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ ఘన విజయం సాధించడంతో కన్నెపల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. బిజెపి మండల అధ్యక్షులు రామయ్య, మాజీ సర్పంచ్ రాజయ్య ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏమాజీ పాల్గొన్నారు. మిఠాయిలు తినిపించుకుంటూ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.