హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో భీమిని మండలం వీగాం గ్రామ పంచాయతీకి చెందిన గట్టు సాయి ఇంద్రనీల్ గౌడ్( 32) మంగళవారం మృతి చెందాడు. ఇంద్రనీల్ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బైక్ పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గతేడాది భర్త రామా గౌడ్, ఇప్పుడు కుమారుడి మృతితో తల్లి తులసి బాయ్ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.