కోల్కత్తాలో జూనియర్ డాక్టర్ ను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. నర్సింగ్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, ఉపాధ్యక్షురాలు అనిత, నాయకురాళ్లు లక్ష్మి, రాజక్క పాల్గొన్నారు.