బెల్లంపల్లి టిఎన్టియుసి కార్యాలయంలో గురువారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆ సంఘం నాయకులు మణిరామ్ సింగ్, ఏడుకొండలు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలోనే సింగరేణిలో పరుగు పందెం ద్వారా ఉద్యోగాల కల్పన ద్వారా పెద్ద ఎత్తున జరిగిందని గుర్తు చేశారు.