బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.